కరోనా కేసులు పెరగాలని ఎవరైనా అనుకుంటారా?


ఐదేళ్లలో అత్యవసర వైద్య సదుపాయాలు పెంచింది లేదు. వెంటిలేటర్లు, కొత్త ఐసీయూల  ఏర్పాటుకు రూపాయి ఖర్చు పెట్టలేదు చంద్రబాబు. ఇపుడు కరోనాలాంటి వ్యాధులు వస్తాయని తనకు ముందే తెలుసుని కథలు చెబుతున్నాడు. బాబు అధికారంలో ఉండగా 108, 104 అంబులెన్సుల్ని మూలన పడేసి ప్రజల్ని ప్రమాదంలోకి నెట్టి వెళ్లిపోయాడు. అని వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ఆరోపించారు. 


ప్రధానితో వీడియో కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  మాట్లాడింది విన్న తర్వాత రాష్ట్ర సన్నద్ధత గురించి ఇంకా ఏమైనా అనుమానాలున్నాయా బాబూ?  సొల్లు మాటలు కట్టిపెట్టండి. శవ రాజకీయాలు చేయొద్దని చోడవరంలో చనిపోయిన వృద్ధురాలి బంధువులు గడ్డి పెట్టారుగా. సిగ్గు తెచ్చుకోండి.


రాష్ట్రంలో కరోనా కేసులు పెరగాలని ఎవరైనా అనుకుంటారా? మనిషి జన్మ ఎత్తిన వారెవరూ అలా కోరుకోరు. ఎల్లో మీడియా, చంద్రబాబు, ప్యాకేజీ జీవులు మాత్రం ఇటువంటి శాడిస్టిక్ భ్రమల్లో ఉన్నారు.  సీఎం జగన్‌  వ్యాధిని నియంత్రించడంలో విఫలమయ్యారని నింద వేసేందుకు కాచుక్కూర్చున్నారు. అని విజయ సాయిరెడ్డి మండిపడ్డారు.