గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఎమ్మెల్యే వివేకానంద బలపరిచారు. ఈ తీర్మానంపై పలువురు సభ్యులు మాట్లాడిన అనంతరం సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. అనంతరం సభ వాయిదా పడింది.